వాసవీ మాతకు ‘ముత్యాల చీర’ సమర్పణ

మైదుకూరు: పట్టణంలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మైదుకూరు ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో సుమారు 2 లక్షల విలువైన ముత్యాల చీరను ఘనంగా సమర్పించారు. ఉదయం 7 గంటలకు కడప రోడ్డులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ముత్యాల చీరను ఊరేగింపుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి…





