వాసవీ మాతకు ‘ముత్యాల చీర’ సమర్పణ
మైదుకూరు: పట్టణంలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మైదుకూరు ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో సుమారు 2 లక్షల విలువైన ముత్యాల చీరను ఘనంగా సమర్పించారు. ఉదయం 7 గంటలకు కడప రోడ్డులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ముత్యాల చీరను ఊరేగింపుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి తీసుకొచ్చారు. ముత్యాల చీరను ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు శ్రీ బల్లాన్ని చెన్నకేశవ ప్రసాద్, కమిటీ సభ్యులకు మహిళా మండలి అధ్యక్షురాలు బళ్లాని సునంద, సభ్యులు అందజేశారు. అనంతరం ఆలయంలో 108 మంది మహిళలతో వడిబియ్యం సమర్పణ, విశేష కుంకుమార్చన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు బల్లాని చెన్నకేశవ ప్రసాద్, ఉపాధ్యక్షులు దొంతు వెంకటసుబ్బయ్య, పేరూరు నాగరాజ, సెక్రటరీ కోట అశోక్ కుమార్, కోశాధికారి దరిశా శ్రీనివాసులు, జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ యెలిశెట్టి గురు ప్రసాద్, జాయింట్ సెక్రటరీ పుట్టా శివ, మండల సంఘం అధ్యక్షులు నూకల సత్యనారాయణ, వంకదార శ్రీనివాసులు, కోటా సంజీవరాయ గుప్తా, ఇమ్మిడిశెట్టి సతీష్, మలిపేద్దు హరినాధ్, కుప్పం కిషోర్ ఆర్యవైశ్య యువజన సంఘం: పుట్టా సాయి అధ్యక్షులు, తులసి సత్య సాయి, భూపాలం ఉపేంద్ర, జొన్నలగడ్డ మనోజ్, ఆర్యవైశ్య మహిళా మండలిఅధ్యక్షురాలు బల్లాని సునంద, బచ్చు శ్రీదేవి, వంకదార వాసంతి మండల అధ్యక్షురాలు మరియు ఇతర మహిళా మండలి, ఆర్యవైశ్య సభ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
