మైదుకూరు: అమరావతి ఛాంపియన్‌షిప్ U-17, U-23 ఖో-ఖో రాష్ట్రస్థాయి పోటీలకు మైదుకూరు మండలం వనిపెంట బీసీ బాలికల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యారు. అండర్-17 ఖో-ఖో రాష్ట్రస్థాయి పోటీలకు ఏ. హిమబిందు, అండర్-23 ఖోఖో రాష్ట్రస్థాయి పోటీలకు బి. దివ్య ఎంపికయ్యారు. విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ నిర్మలమ్మ, సహచర ఉపాధ్యాయులు, సిబ్బంది, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. వనిపెంట బీసీ బాలికల పాఠశాలకు గర్వకారణమని హిమబిందు, దివ్యలు రాష్ట్రస్థాయిలో రాణించి బీసీ గురుకుల బాలికలపేరు నిలబెట్టాలని వారు ఆకాంక్షించారు.