మైదుకూరు: వైఎస్సార్ కడపజిల్ా బాలికల అభివృద్ధి అధికారి రూత్ ఆరోగ్య మేరీ ఆధ్వర్యంలో మైదుకూరులోని కేజీబీవీలో నెట్ జీరో హెల్త్ క్యాంపస్ కార్యాక్రమం పై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫారెస్ట్స్ బై హార్ట్ ఫుల్ నెస్ పౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ శిక్షణలో భాగంగా నెట్ జీరో, జీరో కార్బన్, జీరో ప్లాస్టిక్, వర్షపు నీటి సంరక్షణ, గ్రే వాటర్ రీయూజ్, వ్యర్థాల నిర్వహణ, సౌరశక్తి వినియోగం, క్యాంపస్ గ్రీనింగ్, వృక్షారోపణ, నీటి మరియు విద్యుత్ పొదుపు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జీసీడీఓ రూత్ ఆరోగ్య మేరీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని కేజీబీవీలను పర్యావరణహిత, ఆరోగ్యకరమైన గ్రీన్ క్యాంపస్‌లుగా అభివృద్ధి చేయడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఫారెస్ట్స్ బై హార్ట్ ఫుల్ నెస్ పౌండేషన్ జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పనిచేస్తే నెట్ జీరో లక్ష్యాలను విజయవంతంగా సాధించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న 19 కేజీబీవీల ఇన్‌స్టిట్యూషన్ హెడ్‌లు, నోడల్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీపీ ప్రిన్సిపాల్స్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
