బి.మఠంలో బీజేపీ పదాధికారుల సమావేశం

మైదుకూరు: బ్రహ్మంగారి మఠం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి గారి అధ్యక్షతన మండల పదాధికారుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తునూరు సుబ్బరాయుడు గారు హాజరై పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమం చేశారు అలాగే మండల పదాధికారుల మార్పులు- చేర్పులు కొత్త నాయకులకు అవకాశాలు కల్పిస్తూ నూతన పదాధికారుల నమూనా రూపకల్పనపై చర్చించారు. సమావేశంలో మండలంలో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు బీఎల్ఏ-2 వ్యవస్థ బలోపేతం అలాగే మండల పదాధికారుల మార్పులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సర్ కార్యక్రమం రెండో దశలో చేపట్టాల్సిన కార్రచర్ల రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల దృష్ట్యా పార్టీ అనుసరించాల్సిన పూజలు బూతు సంసాగత బలోపేతం ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధానాలపై సమగ్రంగా మార్గ నిర్దేశం చేశారు. మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలు, పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వాటి పరిష్కార మార్గాలు పార్టీ బలోపేతానికి కావలసిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశానికి ఓబిసి మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రకాంతo ఈశ్వరయ్య, పోలు అంకిరెడ్డి, జోగుపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణయ్య, కటారువెంకటరమణ, బుసెట్టి సుధాకర్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు విజయ్ బాబు పల్లి గ్రామానికి చెందిన వెంకట సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.