మైదుకూరు: నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో “ఇంటింటికి టీడీపీ” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. అలాగే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రాకెట్ రఫీ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ పెద్దయ్య, 5వ వార్డు ఇన్‌చార్జ్ షేక్ అల్తాఫ్ హుస్సేన్, ఐటీడీపీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ హుస్సేన్, తెలుగు యువత ఉపాధ్యక్షులు శివరామ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.