నూతన స్మశానవాటికను ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్..
దువ్వూరు: మండల పరిధిలోని గుడిపాడు గ్రామంలో MGNREGS పథకం కింద రూ. 20 లక్షలతో నిర్మించిన నూతన స్మశానవాటికను శనివారం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు. గుడిపాడు గ్రామ ప్రజలకు ఎంతోకాలంగా అవసరమైన స్మశానవాటికను నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు తన వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గుడిపాడు గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.