‘బాలికే భవిష్యత్తు’ భేటీ బచావో భేటీ పడావో

మైదుకూరు: భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం మైదుకూరు మండలం లోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల మరియు ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జె ప్రశాంతి మాట్లాడుతూ బాల్య వివాహాల గురించి, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, వుమెన్ హెల్ప్ లైన్ 181, టెలి మానస్ హెల్ప్ లైన్ 14416 గురించి వివరించడం జరిగింది తదుపరి ఐసీడీఎస్ సూపర్వైజర్ జె.శ్రీదేవి మాట్లాడుతూ.. మిషన్ వాత్సల్య పథకం మరియు ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.