బి.మఠం: భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఇన్చార్జ్ చిట్టిబాబు అన్నారు. బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో మంగళవారం జరిగిన పార్టీ మండల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మంగారిమఠం వెనుకబడిన ప్రాంతమని, సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. వాటి పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఇతర పార్టీలకు చెందిన వారిని కూడా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలన్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు మండల అధికారులను కలిసి సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ మండల కన్వీనర్ పెద్దిరెడ్డి చంద్రఓబులరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ నాయుడు, ఎస్సీ మోర్చాఅధ్యక్షులు విజయ్, రమేష్, సుధాకర్, పోలు అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.