👉 జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 148 కేసులు నమోదు, రూ. 38,795 జరిమానా విధించిన పోలీసులు
కడప: జిల్లాలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 148 కేసులు నమోదు చేసి, రూ. 38,795 జరిమానా విధించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో వెళ్లే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని , రాంగ్ రూట్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.