మైదుకూరు ఎమ్మెల్యేకు మాతృవియోగం

మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి మాతృమూర్తి శ్రీమతి పుట్టా పోలమ్మ గారు శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని పీ.ఆర్.కే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీమతి పుట్టా పోలమ్మ గారి మరణవార్త తెలుసుకున్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీమతి పుట్టా పోలమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ పరమాత్మ వారికి ప్రసాదించాలని పలువురు ఆకాంక్షించారు.