మైదుకూరు: మైదుకూరు మండలం వనిపెంట ప్రభుత్వ ఆసుపత్రి(PHC)లో ప్రదాన మంత్రి మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఎస్ఆర్ సుభద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తమ్మిశెట్టి సుభద్రమ్మ, స్థానిక టీడీపీ నాయకులు తమ్మిశెట్టి సుబ్బారాయుడు దంపతుల సహకారంతో రెండో సారి ఈ నెలలో 200 మంది గర్భవతులకు, రోగులకు పౌష్టికహార భోజనాన్ని అందించారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు స్థానిక టీడీపీ నాయకులు ఇస్మాయిల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కటారు వీరన్న, స్థానిక గ్రామ యువకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తమ్మిశెట్టి సుబ్బారాయుడు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఇక మాతృత్వ అభియాన్ కార్యక్రమంను ప్రతి నెల నిర్వహిస్తానని తెలిపారు. టీఎస్ఆర్ సుభద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని ఆసుపత్రి యాజమాన్యం, ప్రజలు కొనియాడారు.