అలవలపాడు ఎంపీటీసీ బరిలో భూమిరెడ్డి విజయభారతి..!?

  • మైనింగ్ అక్రమాలపై పోరాటమే లక్ష్యంగా సీపీఐ తరఫున పోటీకి సన్నాహాలు

వేంపల్లి: వేంపల్లి మండలం అలవలపాడు ఎంపీటీసీ స్థానానికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) తరఫున ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు భూమిరెడ్డి విజయభారతి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సీపీఐ నాయకత్వంతో ఆమె చర్చలు జరిపినట్లు సమాచారం.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జాల ఈశ్వరయ్య సోదరిగా గుజ్జల కుటుంబం తో ఉన్న సానిహిత్యం వల్ల విజయభారతి ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. విద్యారంగ సమస్యలపై తనదైన స్వరాన్ని వినిపిస్తున్న ఆమెను స్థానిక ప్రజా సమస్యలపై పోరాటానికి తీసుకురావాలని సీపీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రత్యేకంగా వేంపల్లి మండలంలో మైనింగ్ కార్యకలాపాలపై వస్తున్న ఆరోపణలు,పర్యావరణం–ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను ఎంపీటీసీ వేదికగా ప్రశ్నించాలనే లక్ష్యంతో విజయభారతిని బరిలోకి దింపేందుకు సీపీఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.అలవలపాడు గ్రామంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన స్థానిక నాయకుల మధ్య సాన్నిహిత్యంపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ప్రజా సమస్యలను ప్రధాన ఎజెండాగా చేసుకుని వామపక్ష అభ్యర్థిని రంగంలోకి దించితే రాజకీయంగా ప్రభావం చూపవచ్చని సీపీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఆమె బరిలోకి దిగితే అలవలపాడు ఎంపీటీసీ ఎన్నిక రాజకీయంగా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.