సామాజిక అభివృద్దే టీడీపీ లక్ష్యం: ఎమ్మెల్యే పుట్టా

  • మైదుకూరులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పుట్టా..
  • కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే..

మైదుకూరు: మున్సిపాలిటీ 13వ వార్డు శ్రీరామ్ నగర్ లో ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) గ్రాంట్ కింద రూ.25 లక్షల నిధులతో 13వ వార్డులో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయిన అనంతరం వార్డు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు నరసింహులు, కూటమి ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వార్డు ప్రజలు, అభిమానులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.