సీనియర్ కార్యకర్తకు ఎమ్మెల్యే ఘననివాళి
మైదుకూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పందిటి నడిపి సుబ్బరాయుడ, ఓబులమ్మ దంపతులు ఇటీవల జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వారి నివాసానికి వెళ్లి దివంగత దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలో పార్టీ విజయానికి తమ వంతు కృషి చేస్తూ, పార్టీ అభివృద్ధికి విశేష సేవలు అందించి, నిబద్ధత కలిగిన కార్యకర్తలుగా పందిటి నడిపి సుబ్బరాయుడును స్మరించుకున్నారు. ఆయన సేవలను పార్టీ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కనీస వేతనాల సలహా మండలి సభ్యులు దాసరి బాబు, మైదుకూరు పట్టణ టీడీపీ కన్వీనర్, చాపాడు మండల కన్వీనర్ వెంకటసుబ్బారెడ్డి (వైట్), అన్నవరం సుధాకర్ రెడ్డి, పందిటి పెద్దయ్య, మాదం రమణ (డీలర్), పందిటి సురేష్ (డీలర్), అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత దంపతులకు ఘన నివాళులు అర్పించారు.
