బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి.. 16 వ శతాబ్దము లో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి..హేతువాది.. సంఘ సంస్కర్త. అందువల్లనే ప్రపంచానికే జ్ఞానబోధ చేశారు. నాలుగ శతాబ్ధాల కిందటే భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచారు. కడప జిల్లా లోని కందిమల్లాయపల్లి లో శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి (1608 – 1693) నివసించి సజీవ సమాధి నిష్ఠనొందాడు. వీరబ్రహ్మము జీవ స‌మాధి పొంద‌టు చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో ‘‘బ్రహ్మంగారిమఠం’’గా ప్రసిద్ధి చెందింది.
                               – జ‌ర్న‌లిస్టు నందిరెడ్డి నాగ‌శివారెడ్డి..

               

            16వ శతాబ్ధంలో ప్రపంచ పోకడలు గురించి కాలజ్ఞానం ద్వారా తెలియజెప్పిన మహిమాన్వితుడు వీార బ్రహ్మంగారు సజీవ సమాధి పొందిన బ్రహ్మంగారి మఠం ఎందుకు అంతర్జాతీయ గుర్తింపు ల‌భించ‌లేదు.. షిర్డీ సాయిబాబా ఒక మార్మికుడు, సాధువు, యోగి. 1918 అక్టోబరు 15 గుడిలో సమాధయ్యారు.. బ్రహ్మం గారూ 16వ శత్ధాబ్ధంలో జీవించి సజీవ సమాధయ్యారు.. మూడు శత్ధాబ్ధాలు ముందే సజీవ సమాధి పొందిన బ్రహ్మంగారి మఠం కనీస వసతులు దిక్కుమొక్కులేకుండా ఉండిపోయింది.. షిర్డీని అభివృద్ధి చేసేందుకు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,200 కోట్లతో అభివృద్ధి చేప‌ట్టింది.. షిర్డీ సాయిబాబా ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే భ‌క్తుల‌కు అనుగుణంగా నవీ ముంబైలోని నైనా (నవీ ముంబై ఎయిర్‌పోర్ట్-ప్రభావిత నోటిఫైడ్ ఏరియా) ప్రాజెక్ట్ తరహాలో అహ్మద్‌నగర్‌లోని షిర్డీ విమానాశ్రయం నెల‌కొల్పారు.. కాల‌జ్క్షాన క‌ర్త బ్ర‌హ్మంగారి మ‌ఠంలో బ‌స్టాండు లేని ప‌రిస్థితి..

బ్ర‌హ్మంగారి మ‌ఠంను అంత‌ర్జాతీయ గుర్తింపు కోసం ఎమ్మెల్యే పుట్టా క‌స‌ర‌త్తు..
                                    బ్ర‌హ్మంగారి మ‌ఠం అన్న‌ది ఒక‌టుంద‌ని గానీ..? ప్ర‌పంచం పోక‌డ‌లు, వ‌ర్త‌మాన భ‌విష్య‌త్తు గురించి కాలజ్ఞానం ర‌చించిన బ్ర‌హ్మంగారి గురించి.. సజీవ సమాధి నిష్ట నేప‌ధ్యంను గురించి ఇండియా ప్ర‌భుత్వంకు తెలియ‌జేసి షిర్డీ క్షేత్రం త‌ర‌హాలో బ్ర‌హ్మంగారి మ‌ఠంను అభివృద్ధి చేయాల‌నే ఆలోచ‌న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ మ‌దిలో త‌ట్టింది.. ఎమ్మెల్యే స్వ‌మండ‌లం బ్ర‌హ్మంగారి మ‌ఠం. అదే మండ‌లంలోని కొత్త‌ప‌ల్లె వారి స్వ‌గ్రామం.. నాకు ఎమ్మెల్యే ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన మైదుకూరు ప్రాంత ప్ర‌జ‌ల‌కు బ్ర‌హ్మంగా మ‌ఠంను అంత‌ర్జాతీయ గుర్తింపు తీసుకురావాల‌నే దృఢ‌సంక‌ల్పం పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ లో క‌ల్గింది..
ప్ర‌సాద్ పథకం పై దృష్టి …

                          తీర్థయాత్ర పునరుజ్జీవనం మరియు ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్ (ప్రసాద్)” అనేది భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర రంగ పథకం 2014–2015లో ప్రారంభించబడిన పథకం ఇది.. ఈ ప‌థ‌కం ద్వారా భారతదేశం అంతటా పుణ్యక్షేత్రాలను అభివృద్ధి పరచడం తద్వారా మతపరమైన పర్యాటక అనుభవాన్ని సుసంపన్నం చేయ‌డం ముఖ్య ఉద్దేశ్యం.. చేసే పథకం. ఈ ప‌థ‌కం కింద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి, అన్నవరం, సింహాచలం, తెలంగాణలోని రామప్ప, భద్రాచలం, జోగులాంబ పుణ్యక్షేత్రాలను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసి ప్రసాద్ పథకం కింద అభివృద్ధి చేప‌ట్టింది. ప్ర‌సాద్ ప‌థ‌కం కింద పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆర్థిక సహాయాన్ని (CFA) అందిస్తుంది. ఈ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం 100% ఖర్చులను భరిస్తుంది. అలాగే నిరంతర నిర్వహణకై పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP), కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులు సమకూర్చుకోవాల్సి ఉంది..
బ్ర‌హ్మంగారి క్షేత్రంను ప్ర‌సాద్ స‌థ‌కం వ‌ర్తించేందుకు పుట్టా పోరాటం…

ఎలాగైనా బ్ర‌హ్మంగారి మ‌ఠంకు ప్ర‌సాద్ ప‌థ‌కం వ‌ర్తింప‌చేసేందుకు ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ రంగంలోకి దిగారు.. ఇందుకు త‌న కుమారుడు ఎంపీ మ‌హేష్ యాద‌వ్ స‌హాకారం తీసుకున్నారు.. ఆమేర‌కు డీపీఆర్ ను సిద్దం చేసే ప్ర‌ణాళిక చేప‌ట్టారు. 2026లో జూలై లో టూరిజం శాఖ అధికారుల‌ను ఎమ్మెల్యే సంప్ర‌దించారు.. మ‌ఠంను ప్ర‌సాద్ ప‌థ‌కం కు చేర్చి అభివృద్ధి ఏ విధంగా ఉండాల‌న్న‌దానిపై న‌మూన‌ను సిద్దం చేసే బాధ్య‌త‌ను ఆదిత్య సంస్థ‌కు అప్ప‌గించారు… ఈ న‌మూనా సిద్దం చేసేందుకు అయ్యే ఖ‌ర్చు సుమారు 25 ల‌క్ష‌లు ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ స్వ‌యంగా భ‌రించారు. మ‌ఠంకు సంబంధించి ఆదిత్య సంస్థ 3డి త‌ర‌హాలో ఒక న‌మూనా( డిజైన్) రూపొందించింది.. ఆ డీజైన్ కు సంబంధించి చిత్రాలు కూడా విడుద‌ల‌య్యాయి..
ఎమ్మెల్యే , ఎంపీ ఇలా ముంద‌డుగు..

కేంద్రం స‌హ‌కారంతో ప్ర‌సాధ్ ప‌థ‌కంలో భాగంగా బ్ర‌హ్మంగారి మ‌ఠం ఆల‌యాన్ని అభివృద్ధి చేసేందుకు తాము సిద్దం చేసుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాదవ్‌, ఎంపీ మ‌హేష్‌కుమార్ యాద‌వ్( వారి త‌న‌యుడు) డిపిఆర్ ను కేంద్రప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మ‌ఠం ఆలయంకు సంబంధించి రిపోర్టు అందించాల‌ని రాష్ట్ర టూరిజం శాఖ‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించింది.. ప్రిన్స్ ప‌ల్ సెక్ర‌ట‌రీ అజ‌య్ జైన్ మ‌ఠం అల‌యంను ప్ర‌సాద్ ప‌థ‌కంలో చేర్చాల్సిన ఆవ‌శ్య‌కత‌కు సంబంధించి రిపోర్టు కేంద్ర మంత్రిత్వ శాఖ‌కు అంద‌జేశారు.. బ్రహ్మంగారి మఠానికి ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలని యునెస్కో అధికార ప్రతినిధిని ఇటీవ‌ల మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డిల్లీలో బ్రహ్మంగారి మఠాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించాలంటూ అధికారికంగా వినతిపత్రం అందజేశారు.
పొతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు జీవసమాధి కాబడిన బ్రహ్మంగారి మఠం ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు సామాజిక సంస్కరణల పరంగా ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన కేంద్రమని తానే మ‌రో 20 ల‌క్ష‌లు వెచ్చించి రూపొందించిన బ్ర‌హ్మంగారి చ‌రిత్ర‌ను 3డీ ని యునెస్కో అధికార ప్ర‌తినిధికి అంద‌జేశారు.. ఎమ్మెల్యే చొర‌వ‌తో ఈ ఆలయానికి ప్రసాద్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు డీపీఆర్ ప్ర‌క్రియ పూర్తియింది.కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఆ దిశగా కీలక ముందడుగు పడింది.
కేంద్రమంత్రికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్, ఎంపీ పుట్టా మహేష్ విన‌తి….

ప్రసాద్ పథకం కింద నిధులు బ్రహ్మంగారి మ‌ఠం ఆల‌యంకు విడుద‌ల కొర‌కు గ‌త‌ శుక్రవారం న్యూ ఢిల్లీలో వారి నివాసంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్న ని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఎంపీ పుట్టామహేష్ కుమార్ కలిసి \విన్న‌వించుకున్నారు. బ్రహ్మంగారి మఠం అభివృద్ధికి సంబంధించి రూ. 139.60 కోట్ల విలువైన డీ టైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను ఎమ్మెల్యే, ఎంపీ కేంద్రమంత్రికి సమర్పించారు. ఈ సందర్భంగా రాబోయే 2026-27 కేంద్ర బడ్జెట్లో బ్రహ్మం గారి మఠానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు జీవసమాధి కాబడిన బ్రహ్మం గారి మఠం ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామా జిక సంస్కరణల పరంగా ప్రపంచ ప్రాము ఖ్యత కలిగిన కేంద్రమని కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే పుట్టా సుధా కర్ యాదవ్ స‌మ‌గ్రంగా వివరించారు.
అయిదు శ‌తాబ్ధాల కింద‌ట ( 1608 – 1693) కంది మల్లాయపల్లి లో సజీవ సమాధి నిష్ఠనొందిన వీరబ్రహ్మము గారి స్థిర‌నివాసమైన బ్ర‌హ్మంగారి మ‌ఠం ను ప్ర‌సాద్ ప‌థ‌కం కిందకు తెచ్చి అభివృద్ధి ప‌థ‌కంలోకి తీసుకురావ‌లన్న ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ఆకాంక్ష‌ను బ్ర‌హ్మంగారి భ‌క్తులు, మైదుకూరు ప్రాంత ప్ర‌జ‌లు బ‌ల‌ప‌రిచి సంఘీభావం తెలియ‌జేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది..