. జర్నలిస్టు నందిరెడ్డి  నాగశివారెడ్డి…
‘‘ప్రసాద్ ఆరోగ్య ప‌రిస్థితి బాగాలేక‌పోతే వాళ్ల ఇంటికి వెళ్లా.. సార్‌, నేను డ‌యాల‌సిస్ కోసం క‌డ‌ప వెళ్లాలంటే చాలా క‌ష్టంగా ఉందంటూ త‌న క‌ష్టాల‌ను నాకు తెలియ‌జేశారు.. నాలాగే మైదుకూరు ప్రాంతంలో చాలా మంది డ‌యాలిసిస్ బాధితులున్నారు.. వాళ్లంతా క‌డ‌ప‌కు వెళ్లి ర‌క్త‌మార్పిడి చేయించుకోవాలంటే చాలా క‌ష్ట‌న‌ష్టాల‌కు గుర‌వుతున్నారని చెప్పారు.. ప్ర‌సాద్ త‌న బాధ‌ను నా వ‌ద్ద ఏక‌ర‌వుపెట్టారు. ఆ బాధ నాకుతీవ్రంగా క‌లిచివేసింది.. మైదుకూరులో 15వంద‌ల బాధితుల‌కు అండ‌గా నిల‌బ‌డాలి అని క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నా.. ఆరోజు నుండే మైదుకూరులో డ‌యాలిసిస్ సెంట‌ర్ ఏర్పాట‌కు చ‌ర్య‌లు తీసుకున్నా.. ప్ర‌భుత్వంకు ప్ర‌తిపాద‌న‌లు పంపా’’
-2024 డిశంబ‌రు 31న ఆంధ్ర‌జ్యోతి రిపోర్ట‌ర్ ప్ర‌సాద్ సంతాప‌స‌భ‌లో ఎమ్యెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌..
‘‘ఆంధ్ర‌జ్యోతి విలేక‌రి ప్ర‌సాద్ మ‌ర‌ణం నాకు బాధ క‌లిగించింది.. డ‌యాల‌సిస్ చేయించుకునే విష‌యంలో త‌మ క‌ష్టాల‌ను తెలియ‌జేసి క‌న్నీరు పెట్టుకున్నారు. ప్ర‌సాద్ లాంటి డ‌యాల‌సిస్ రోగులు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని మైదుకూరులో డ‌యాల‌సిస్ కేంద్రం తెప్పించాలి అనుకున్నా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చాలా సారు కింద స్ధాయి నుండి పైస్ధాయి వ‌ర‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు ఎట్ట‌కేల‌కు డ‌యాల‌సిస్ కేంద్రం మంజూరు కాబ‌డింది.. ప్ర‌సాద్ మ‌న మ‌ధ్య‌లేక‌పోయినా వారి ప్రేర‌ణే నాకు కార‌ణ‌ము’’..
-ఇటీవ‌ల మీడిమా స‌మావేశంలో ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌…
జ‌ర్న‌లిస్టు ప్ర‌సాద్ గురించి..

త‌న బ‌తికిన కాలంలో సుదీర్ఘ కాలం జ‌ర్న‌లిస్టు.. ఆంధ్ర‌జ్యోతి , ఏబీఎన్ సంస్థ‌లో రెండు ద‌శాబ్దాలుగా ప‌నిచేశారు.. తను ప్రాణాలు వ‌దిలే వ‌ర‌కు జ‌ర్న‌లిస్టు వృత్తిలో కొన‌సాగారు.. మైదుకూరు ప్రాంతంలో జ‌ర్న‌లిస్టుగా అంద‌రికీ సుప‌రిచితులు.. వీరి అస‌లు పేరు త‌ల్లం వెంక‌ట నాగ ప్ర‌సాద్ గుప్త‌.. 49 ఏళ్ల వ‌య‌స్సులోనే గుండెపోటుకు గుర‌య్యారు.. త‌ర్వాత డ‌యాల‌సిస్ బారిన ప‌డ్డారు.. 23 డిశంబ‌రు 2024న అనారోగ్యం కార‌ణంగా ఈ లోకం వ‌దిలివెళ్లారు.. ప్ర‌సాద్‌కు ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు.. అనారోగ్యం గుర‌య్యాక మొద‌టి అమ్మాయి పెండ్లి చేశారు.. ఆ త‌ర్వాత క‌న్నుమూశారు..

ఎమ్మెల్యే పుట్టాసుధాక‌ర్ యాద‌వ్ ఆదుకున్న తీరు..

ప్ర‌సాద్ జ‌ర్న‌లిస్టుగా ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కు సుప‌రిచితులు.. 2023 లో అక‌స్మాత్తుగా గుండెపోటుకు ప్ర‌సాద్ గుర‌య్యారు.. అత్యంత మిత్రులుగా ఉన్న ఈనాడు భాస్క‌ర్‌రెడ్డి, ఆంధ్ర‌జ్యోతి వాసు, కొండ‌ప‌ల్లి ఉమాకాంత్ , నాకు గుండెపోటుకు గురైన విధానం తెలియ‌జేశారు.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ప్ర‌సాద్ ను ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కు చెందిన పీఆర్కే ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాము.. వెంట‌నే ప్ర‌సాద్‌కు గుండెపోటు గురించి ఎమ్మెల్యేకు తెలియ‌పరిచాము.. వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకుర‌మ్మ‌నారు.. హైద‌రాబాద్ కు ప్ర‌సాదా్ ను తీసుకెళ్లాం..ఎమ్మెల్యే , వారి కుమారుడు డాక్ట‌ర్ ర‌వి హుటాహుటీనా డాక్ట‌ర్ల‌చే ప్ర‌సాద్ కు పీఆర్ కే ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు జ‌రిపించారు. మూడు వాల్స్ దెబ్బ‌తిన్నాయ‌ని.. స్టంట్స్ వేసి కొద్దిరోజులు చూద్దామంటూ( మా ఆస్ప‌ట‌ల్ లో వేయిస్తా) డాక్ట‌ర్లు, ఎమ్మెల్యే సుధాక‌ర్ యాద‌వ్, ఎమ్మెల్యే త‌న‌యుడు డాక్ట‌ర్ రవి మాకు వివ‌రించారు.. అయితే, స్టంట్స్ కంటే బైపాస్ స‌ర్జ‌రీ చేయించుకుంటామంటూ ప్ర‌సాద్ భార్యా పిల్ల‌లు నిర్ణ‌యించుకున్నారు.. అయితే, అప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వైద్య‌ప‌రీక్ష‌లు ఖ‌ర్చు 1,20,000 వ‌ర‌కు పీఆర్ కే ఆస్ప‌త్రిలో అయింది.. కానీ, ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే తీసుకోలేదు.. బైపాస్ స‌ర్జ‌రీ క‌ర్నూలు కిమ్స్ లో ప్ర‌సాద్ కు బైపాస్ స‌ర్జ‌రీ చేయించ‌డంతో త‌న‌వంతు స‌హ‌కారం ఎమ్మెల్యే అందించారు..బైపాస్ స‌ర్జ‌రీ త‌ర్వాత మ‌రింత ఆరోగ్యం ప్ర‌సాద్ కు దెబ్బ‌తింది. డ‌యాలిసిస్ బారిన ప‌డ్డారు.. ప‌లు ధ‌పాలు ప్ర‌సాద్ ఇంటికి విచ్చేసి వారి ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకుంటూ.. ప్ర‌సాద్ భార్య‌కు, పిల్ల‌ల‌కు నేనున్నాంటూ ఎమ్మెల్యే సుధాక‌ర్ యాద‌వ్ భ‌రోసా నిచ్చే ప్ర‌య‌త్నం చేశారు.. ఇంకో మాట‌.. ప్ర‌సాద్ పెద్ద‌బిడ్డ పెండ్లికి మూడు ల‌క్ష‌ల డ‌బ్బు ఇచ్చి త‌న దాతృతంను ఎమ్మెల్యే చాటుకున్నారు… అదే ప్రేర‌ణ‌తో మైదుకూరు ప్రాంత డ‌యాల‌సిస్ రోగుల కోసం మైదుకూరు ప్రభుత్వ ఆసుప‌త్రిలో డ‌యాలసిస్ కేంద్రం ఎమ్మెల్యే ఏర్పాటు చేయించారు.. ప్ర‌సాద్ మ‌న మ‌ధ్య‌లేక‌పోయినా.. వారిప్రేర‌ణ వ‌ల్ల డయాల‌సిస్ డ‌యాలిసిస్ కేంద్రం ఏర్పాటుతో మైదుకూరు ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ గుర్తుండిపోతారు..

మైదుకూరు నియోజకవర్గ కిడ్నీ బాధితులకు…

ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ సహకారంతో మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్ మంజూరు కాబడింది.. ఇందు కోసం 90 లక్షల రూపాయల నిధులు ప్ర‌భుత్వం వెచ్చించ‌నుంది. కిడ్నీ రోగుల కోసం కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంతకు ముందు ప్రకటించిన కేంద్రాలకు అదనంగా మరో ఐదు కేంద్రాలకు తాజాగా అనుమతి ఇచ్చారు. మొత్తం 13 కేంద్రాల్లో రెండు కేంద్రాలు గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ఐదు కొత్త కేంద్రాల్లో తిరుపతి జిల్లా రైల్వే కోడూరు, ప్రకాశం జిల్లా కొండేపి, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, కడప జిల్లా మైదుకూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఉన్నాయి. ప్రతి డయాలసిస్ కేంద్రంలో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 13 కేంద్రాల కోసం దాదాపు 11 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. మైదుకూరుకు డ‌యాల‌సిస్ కేంద్రం మంజూరు ఎమ్మెల్యే సుధాక‌ర్ యాద‌వ్ చేయించిన‌ప్ప‌టికీ ఇందుకు ప్రేర‌ణ కీర్తిశేషులు త‌ల్లంప్ర‌సాద్ గార‌ని బ‌లంగా చెప్పొచ్చు..