(నా పాతికేళ్ల జర్నలిజం వృత్తిలో నా పాత్ర ఉన్నకొన్నిఘటనలు.. పోరాటాలు.. నా మదిలో సుస్థిరంగా నిలిచిపోయిన కథనాలు అందించే ప్రయత్నమే ‘‘జర్నలిస్టు డైరీ’’)
ఈ పోటోలో ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఉన్న వ్యక్తి అన్నపురెడ్డి శ్రీమన్నారాయణరెడ్డి కదా..ఇతను రాజకీయ నాయకుడు కదా అనుకునేరు.. మీ తెలిసిన మేరకు అతను పొలిటికల్ లీడరే.. నాకు తెలిసిన శ్రీమన్ గురించి…
ఓయ్.. ఓయ్ అని పిలుచుకునే సన్నిహిత్యం మాది.. అంతే కాదు.. నీవు ఆడపిల్లవు ఐయింటే నేను పెండ్లి చేసుకునే వాడిని అనగలగుతున్నారంటే మా మధ్య ఉన్న స్నేహం అలాంటింది..
ముందు మామధ్య స్నేహం ఉండొచ్చు.. కానీ జర్నలిాజంలో ఉన్నపుడు నాకు తరచూ మైదుకూరులో కనపడేవాడు.. చేతిలో టిఫిన్ బాక్స్ పెట్టుకుని ప్రొద్దుటూరు రోడ్డు వైపు వెళ్తుండేవాడు.. ఏమి టీచర్ అంటూ సంబోధించే వాడిని.. చిక్కని నవ్వు నవి నడుచుకుంటూ వేళ్లేవాడు.. ఆసమయంలో ఆ కాలంలో టీచర్ వృత్తిలో స్థిరపడాలని పట్టుదల ఉండేది.. పెద్దసార్ అంటే కీ.శే తవ్వా ఓబుల్ రెడ్డి తో ఉన్నసన్నిహిత్యం వల్ల ఆనందాశ్రమంలోని ఎయిడేడ్ పాఠశాలలో టీచర్ అవుదామని చేరాడు.. రోజు బడికి వెళ్తుండే వారు.. బడి పంతులు అవుతాడులే నా మిత్రుడు అనుకునేవాడిని.. పొలం గట్రా ఎక్కువ ఉన్న కుటుంబమైనప్పటికీ బడి పంతులైతే మంచి సంబంధం వస్తుందనే భావన మా వాడిలో బలంగా ఉండి ఉండేదని నాకు అర్థమైంది.
బడిపంతులుగా పనిచేస్తూనే మంచిగా వ్యవసాయం చేయాలనుకున్నాడు పాపం. ఇంకేముంది తనకున్న పొలంలో కేపీ ఉల్లిపంట వేశాడు.. పెద్దగా డబ్బులు వస్తాయని.. మీకు తెలిసిందే కదా కేపీ ఉల్లి పంట జూదంతో సమానమని.. 2000 సంవత్సరంలో ఖరీఫ్ లో కేపీఉల్లి వేశాడు.. పంట చేతికొచ్చాక ధరలేదు.. కేపీ ఉల్లి కొనుగోలు కేంద్రం వస్తే మంచి ధర వస్తుందని ఆశపడ్డాడు.. కేంద్రం తెప్పించే క్రమంలో అప్పుడు రైతు ఉద్యమం బాగా మైదుకూరులో నడుస్తోంది. యువ రైతు కదా ఆ ఉద్యమంలో చేయి కలిపాడు.. ఆ ఏడాది ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.. పెద్ద రైతు బిడ్డ కదా.. ఉద్యమంలో మొదటిసారి అడుగులు వేశాడు.. వీడి దురదృష్టమో.. రాజకీయాల్లోకి వచ్చే అదృష్టమో కానీ ఆ ఏడాది బంద్ లు మీద బంద్ లు.. రైతు ఉద్యమాన్ని అణిచివేసే క్రమంలో పోలీసులు ఉక్కుపాదం. లాఠీచార్జ్ జరిగింది. దొరికిన వాళ్లను దొరికినట్లు పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారు..అందులో మా రైతు బిడ్డ ఉన్నాడు..
ఆ ఉద్యమంలో జర్నలిస్టుగా నేను పోషించిన ప్రాత చాలా గొప్పదే.. రైతులను, ఉద్యమ నాయకులను పోలీసుస్టేషన్ కు తీసుకు వచ్చిన పోలీసులు చితక బాదుతారనే భయంతో మమ్మల్ని ఎంజే లాంటి ఉద్యమ నాయకులు అక్కడే ఉండమన్నారు.. అప్పుడు చూశా మిత్రుడు శ్రీమాన్ స్టేషన్ లో ఉండిపోయాడు.. నన్ను చూసి పోలీసులు కేసు పెడితే నా బడిపంతులు ఉద్యోగం పోతుంది.. కేసు లేకుండా చూడు సామి అన్నాడు.. మిత్రుడు భవిష్యత్తును గుర్తించా.. అప్పటికీ ఇంకా కేసుల నమోదు ప్రక్రియ పోలీసులు ఆరంభించలేదు.. పోలీసు అధికారితో నాకున్న సన్నిహిత్యంవల్ల నీకేంకాదు నాతో రా అని బయటకు తీసుకువచ్చా.. ఇంకేముంది అదే మా వాడి జీవితంను మార్చివేసింది.. ఈ కేపీ ఉల్లి వల్ల నా భవిష్యత్తు సంకనాకుతుందనుకున్నట్లుంది.. బడిపంతులు ఉద్యోగం వద్దకుని… తిరిగి చూడకుండా హైదరాబాద్ కు మకాం మార్చాడు.. కాంట్రాక్టరు వృత్తిలోకి దిగారు.. తర్వాత నాకు కూడా కన్పించనంత దూరంలో ఉండిపోయాడు..
నేను సాక్షిలో పనిచేస్తున్న సమయంలో చిన్నయ్యగారిపల్లెలో దర్శనమిచ్చాడు. ఆ సందర్భం ఏమిటంటే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అండగానిలిచేక్రమంలో ఊరిలో విగ్రహం నెలకొల్పిన ఘటనలో కేసున బారిన సందర్భం. పోలిటికల్ రంగ ప్రవేశం.. నేను సాక్షిలో ఉండటం వల్ల మిత్రుడికి నా సహకారం బాగా ఉపయోగపడింది.. వైసీపీ కీలకంగా వ్యహరించారు.. భూమా నాగిరెడ్డి, శోభక్క తో కలసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులపై పెద్ద ఎత్తున నడిచిన ఉద్యమంలో మా మిత్రుడు కీలక పాత్రపోషించారు.
మా వాడిపై వైెెఎస్ జగన్ కన్ను పడిందా..|
ఆ సమయంలో మైదుకూరు నియోజకవర్గంకు వైసీపీ తరుపున ప్రాతినిధ్యం వహించే పెద్ద నాయకుడు లేరు.. పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న శ్రీమన్ పై జగన్ మోహన్‌రెడ్డి కన్నుపడినట్టు ఉంది.. 2014 ఎమ్మెల్యే ఎన్నికల్లో మీరు పోటీకి సిద్దంగా ఉండండి అని మా వాడికి జగన్ చెప్పినట్లు ఉంది.. అర్జంట్ గా రా బావ మా పొలం వద్ద కు నీతో మాట్లాడాలి అన్నాడు.. నేను వెళ్లా.. నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్దంగా ఉండమని జగన్ నుండి కబురొచ్చింది.. ఎలా మన పరిస్థితి అని అడిగారు.. పోటీ చేయాలంటే డబ్బులు కావాలి కదా అని అడిగా.. డబ్బు గురించి ఆలోచన అవసరం లేదన్నారు.. అప్పటి రాజకీయ సమీకరణలు, ఎన్నికల్లో డబ్బు ఖర్చు గురించి మాట్లాడుకున్నాము.. జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సర్వం సిద్దమైంది. అయితే, ఎక్కడా ఈ విషయం ఎక్కడ బయట పెట్టకు అన్నాడు.. సరే అని రహస్య మీటింగ్ కు గుడ్ బై చెప్పి వచ్చేశాము.. తర్వాత తమ రఘురామిరెడ్డి వైసీపీలోకి రావడంతో మా పెద్దాయన వచ్చాడు లే అంటూ శ్రీమన్ పోటీ చేసే విషయం వదిలేసుకున్నాడు.. పెద్దాయనకు నమ్మిన శిష్యుడుగా రాజకీయాలు చేస్తూ వచ్చాడు.. సహకారసొసైటిలో తన పట్ల రైతులకు, ప్రజలకు ఉన్న అభిమానం ఏపాటిదో తెలియజెప్పాడు.. వైసీపీలో ప్రముఖ పాత్రపోషిస్తూ వ్యవసాయ మార్కెట్‌కమిటీ పదవిలో కూర్చున్నాడు.. బడి పంతులు కావాల్సిన మా వాడు కాంట్రాక్టర్ గారాణిస్తూ ఇటు పొలిటికల్ లీడరయిపోయాడు.. నేను వాడి ఇంటికి వెళ్తున్న క్రమంలో దంతెల మిద్దెలో ఉండటం చూసి నిన్ను చూస్తే చెక్క లవంగాల వ్యాపారస్తుడున్నట్లు ఉంటావు.. ఇండ్లు చూస్తే బోద కొట్టమన్న నయమంటూ వాడిని ఎగతాళి చేసేవాడిని.. నా ఎగతాళిని ఛాలెంజ్ గా తీసుకుని పల్లెలో పెద్ద ఇండ్లేకట్టాడు.. అతగాడు పిలిచినప్పుడు ఇంటికి వెళ్లిన ప్రతిసారి నీవు ఎగతాళి చేశావు.. లక్షలు డబ్బు ఖర్చుచేయించావు అంటూ తరచూ నాతో ఉచ్చరించేవాడు
మా శ్రీమన్ తో నాకున్న సన్నిహిత్యం..
అది పార్లమెంట్ ఉప ఎన్నికలు.. కొండసురేఖ , శోభక్క, భూమా నాగిరెడ్డెన్న ఉప ఎన్నికల ప్రచారంలో మా వాడు బిజీగా ఉన్నాడు.. అదే సమయంలో నాకు డబ్బు అవసరమైంది.. శ్రీమన్ లక్షా 30వేలు డబ్బు అవసరమైంది మళ్లీ ఇస్తా అని అడిగా ( ఆ సమయంలో).. వెంటనే ఇచ్చేశాడు.. నా అవసరం తీరింది.. అంత డబ్బు కదా తొందరగా ఇవ్వలేకపోయా.. మూడు నాలుగేళ్లు పట్టింది మా వాడు డబ్బు గురించే అడగలేదు.. నాకు డబ్బులు రాగానే ఆ డబ్బులు ఇచ్చేప్రయత్నంచేశా.. వొద్దు అవసరం లేదు.. నేను ఈ స్ధాయికి వచ్చాను అంటే నీ సహకారం ఉంది అని తీసుకోలేదు.. మీరు సమయానికి డబ్బు ఇచ్చారు.. నేను ఇవ్వాలి.. మీరు తీసుకోకుంటే నేను మీరు కనపడగానే తలకాయ దించలేను.. మీ వద్ద విలువ ఉండాలి అంటే డబ్బు తీసుకోవాల్సిందే అని పట్టుబట్టా.. నా నుండి తీసుకోకపోతే డాబా సుబ్బారెడ్డికి ఇచ్చి శ్రీమన్కు ఈ డబ్బు ఇవ్వుఅని పంపించా.. చాలా ఫీల్ అయినట్లు ఉన్నాడు మిత్రుడు శ్రీమన్.. వడ్డీ వొద్దని అసలు బలవంతంగా తీసుకున్నాడు.. మిత్రుడి వద్ద తలదించుకునే పరిస్థితి తప్పిందని సంతోష పడ్డా.. అది మా మధ్య ఉన్న మిత్రుత్వం.. మా స్నేహ బంధం విలువలతో ఉండిపోవడం వల్ల అతి స్ధిరకాలం ఉంటుందని నా భావన..
నా బిడ్డ పెండ్లి సమయంలో నాకు అండా నిలబడాలి అనుకున్నాడు.. ఆ సమయంలో కొత్త ఇన్నోవా కారు తెచ్చాడు.. నాకు బహుమతిగా ఇవ్వబోయాడు.. నేను నిరాకరించా.. నా బిడ్డ పెండ్లి కోసం పల్లె కు వచ్చాడు.. వారి బంధువుల్లో ఒకరు చనిపోగా సూదకం వచ్చింది.. సూదకం కాబట్టి మీరు నాబిడ్డ పెండ్లికి రావద్దని ఖరాఖండిగా చెప్పా.. చాలా బాధపడ్డాడు నన్ను పెండ్లికి వద్దు అన్నావే అంటూ.. కనపడిన
సందర్భంతో ఇదే పదం వాడుతుంటాడు కూడా శ్రీమన్
( కేపీ ఉల్లి కన్నీటిా కథనం రాసే క్రమంలో ఆ ఉల్లి వల్లనే శ్రీమన్ పోలిటికల్ అవతారమెత్తిన కథ గుర్తుకు వచ్చి మీకు తెలియపరిచాలని..)