ప్రకృతి అటు చూచినా, ఇటు చూచినా సుందర మనోజ్ఞమైన వాతావరణం మన కన్నుల ఎదుట సాక్షాత్కరింపజేస్తుందీ లంకమల అభయారణ్యం(కడప జిల్లా) . ఆకర్షణీయమైన ప్రకృతిలోని అందమైన దృశ్యాలు మనకు మహానందాన్ని. కలుగజేస్తాయి. ఎత్తైన వృక్షాలు, ఆకాశన్నంటే కొండ శిఖరాలు, సెలయేర్లు, జలపాతాలు మనల్ని తన్మయత్వంతో ముంచెత్తుతాయి. ఈ అభయారణ్యం విలువైన అటవీ సంపద, ఆయుర్వేద వనమూలికలు, ప్రపంచంలోనే అంతరించిన కలివికోడికి, పులికి ఆవాస ప్రాంతం..